News November 14, 2024

STOCK MARKETS: రికవరీయా? పతనమా?

image

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సూచీల గమనం చూస్తుంటే రికవరీ బాట పడతాయో, మరింత పతనమవుతాయో తెలియడం లేదని ఇన్వెస్టర్లు వాపోతున్నారు. నిఫ్టీ 23,591 (+32), సెన్సెక్స్ 77,829 (+141) వద్ద చలిస్తున్నాయి. మీడియా, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. FMCG, ఆటో, O&G రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. శ్రీరామ్ ఫిన్, M&M, అల్ట్రాటెక్ సెమ్, BEL, ట్రెంట్ లాప్ లూజర్స్.

Similar News

News November 14, 2024

స్టార్ క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలు

image

ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తమ అభిమాన హీరోలు, క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, సచిన్, ధోనీ, గిల్, యువరాజ్, పంత్, బుమ్రాల చైల్డ్‌హుడ్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. నెలల బాబుగా ఉన్న రోహిత్ క్యూట్‌గా ఉన్నారని, మొదటిసారి ఈ ఫొటో చూస్తున్నామని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇందులో మీ అభిమాన క్రికెటర్ ఉన్నారా? కామెంట్ చేయండి.

News November 14, 2024

CBSE విద్యార్థులకు అల‌ర్ట్‌

image

వచ్చే ఏడాది 10, 12వ‌ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిల‌బ‌స్ 15% త‌గ్గింపు స‌హా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్‌-బుక్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇండోర్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో సిల‌బ‌స్ త‌గ్గిస్తున్న‌ట్టు CBSE అధికారులు ప్ర‌క‌టించారని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో బోర్డు ఈ వార్త‌ల్ని ఖండించింది.

News November 14, 2024

OTTలోకి ‘కంగువా’ ఎప్పుడంటే?

image

సూర్య నటించిన ‘కంగువా’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.100కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కోలీవుడ్ సినిమాలు 4వారాలకే ఓటీటీలోకి వెళ్తుండగా, అందుకు భిన్నంగా ‘కంగువా’ 6వారాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఇది ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.