News March 5, 2025
స్టాక్‌మార్కెట్లు కళకళ.. మురిసిన ఇన్వెస్టర్లు

స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,337 (+254), సెన్సెక్స్ 73,730 (+740) వద్ద ముగిశాయి. బలమైన కౌంటర్ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.4L CR మేర లాభపడ్డారు. మెటల్, PSE, మీడియా, PSU బ్యాంకు, టూరిజం, ఎనర్జీ, డిఫెన్స్, కమోడిటీస్, ఆటో షేర్లు దుమ్మురేపాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, M&M టాప్ గెయినర్స్. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, HDFC బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్.
Similar News
News March 6, 2026
చర్చల్లేవ్.. లొంగిపోవాల్సిందే: ట్రంప్

ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. లొంగిపోవడం ఒక్కటే ఇరాన్ ముందున్న మార్గమని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత గొప్ప, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్ ఉందని తెలిపారు. MAKE IRAN GREAT AGAIN (MIGA) అని పిలుపునిచ్చారు.
News March 6, 2026
లిక్కర్ స్కామ్.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, చాణక్యకు చెందిన రూ.441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని పేర్కొంది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలిందని వెల్లడించింది. కమీషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేశారని వివరించింది.
News March 6, 2026
ICC టోర్నీల్లో 15వ సారి ఫైనల్‌కు.. గెలుస్తుందా?

టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 1983లో కపిల్ దేవ్ ప్రారంభించిన విజయ పరంపరను గంగూలీ, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మల అడుగుజాడల్లో సూర్య బృందం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది 15వ సారి. WC, CT, WTCలలో మన జట్టు నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఎల్లుండి న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ పోరులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.


