News March 5, 2025

స్టాక్‌మార్కెట్లు కళకళ.. మురిసిన ఇన్వెస్టర్లు

image

స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,337 (+254), సెన్సెక్స్ 73,730 (+740) వద్ద ముగిశాయి. బలమైన కౌంటర్ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.4L CR మేర లాభపడ్డారు. మెటల్, PSE, మీడియా, PSU బ్యాంకు, టూరిజం, ఎనర్జీ, డిఫెన్స్, కమోడిటీస్, ఆటో షేర్లు దుమ్మురేపాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, M&M టాప్ గెయినర్స్. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, HDFC బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్.

Similar News

News March 26, 2025

రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి..సౌత్‌లో ఫస్ట్ టైమ్

image

TG: నిమ్స్ ఆసుపత్రిలో 33ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్‌లో ఇప్పటివరకూ 2వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ పూర్తిచేసినట్లు డాక్టర్లు తెలిపారు.

News March 26, 2025

IPL: రషీద్ ఖాన్ ఖాతాలో మరో మైలురాయి

image

IPLలో అతి తక్కువ మ్యాచుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్ల జాబితాలో GT స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. 122 మ్యాచుల్లో ఆయన ఈ ఘనతను సాధించారు. తొలి రెండు స్థానాల్లో మలింగా (105), చాహల్ (118) ఉన్నారు. 4, 5, 6 స్థానాల్లో బుమ్రా (124), బ్రావో (137), భువనేశ్వర్ కొనసాగుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్‌లో ఉండగా, రషీద్ 11వ స్థానానికి చేరారు.

News March 26, 2025

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకం మార్గదర్శకాలు ఇవే

image

☛ 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి
☛ కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, పల్లెల్లో రూ.1.50లక్షలలోపు ఉండాలి
☛ రేషన్ కార్డు లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాలి
☛ మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్
☛ అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత
☛ <>ఆన్‌లైన్‌లో<<>> మాత్రమే దరఖాస్తులు

error: Content is protected !!