News December 13, 2024
స్టాక్ మార్కెట్లు విలవిల.. RS 2.5L CR నష్టం
స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 24,389 (-156), సెన్సెక్స్ 80,742 (-540) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.2.5లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT, ఫార్మా, మెటల్, కమోడిటీస్, ఎనర్జీ రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. టాటా స్టీల్, JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, INDUSIND టాప్ లూజర్స్. AIRTEL, ADANIENT టాప్ గెయినర్స్.
Similar News
News January 13, 2025
నారావారిపల్లెలో సీఎం బిజీబిజీ
AP: సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో రోడ్లు, రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
News January 13, 2025
జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
AP: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ బరులు సిద్ధం చేసి నిర్వాహకులు పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పందేల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలైన TG, TN, కర్ణాటక నుంచి కూడా చాలామంది ఆసక్తితో కోడిపందేల కోసమే గోదావరి జిల్లాలకు రావడం విశేషం.
News January 13, 2025
చైనాలో hMPV కేసులు తగ్గుతున్నాయ్
చైనాలో hMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఇది చాలా దశాబ్దాలుగా ఉందని, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని చైనా వైద్యాధికారులు తెలిపారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని వివరించారు. భారత్లో 17 hMPV కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.