News September 16, 2024
రికార్డు గరిష్ఠాల్లో స్టాక్ మార్కెట్లు.. రీజన్ ఇదే
బెంచ్‌మార్క్ సూచీలు రికార్డు గరిష్ఠాల్లో మొదలయ్యాయి. మంగళవారం మీటింగులో US ఫెడ్ వడ్డీరేట్ల కోతను ఆరంభిస్తుందన్న సంకేతాలు మార్కెట్లను నడిపిస్తున్నాయి. ఎర్లీ ట్రేడ్‌లో నిఫ్టీ 62పాయింట్ల లాభంతో 25,418 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 219 పాయింట్లు పెరిగి 83,112 వద్ద చలిస్తోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 41:9గా ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, NTPC, హిందాల్కో, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్.
Similar News
News October 11, 2024
సురేఖను తప్పిస్తారనేది ప్రత్యర్థుల ప్రచారమే: TPCC చీఫ్
TG: కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనేది ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమేనని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. సమంత, నాగార్జున ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఆ వ్యవహారం అప్పుడే ముగిసిందని అన్నారు. AICC నేతలంతా బిజీగా ఉండటం వల్లే మంత్రి వర్గం, PCC కార్యవర్గం ఆలస్యమైందని తెలిపారు. దీపావళిలోపు రెండో విడత కార్పొరేషన్ పదవుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు.
News October 11, 2024
ముల్తాన్‌లో మూడు డాట్స్ ఆడితే ఔటివ్వాలి: నాసిర్
ముల్తాన్ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పిచ్‌పై వికెట్లు పడవని, గల్లీ క్రికెట్ తరహాలో వరసగా మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్ అన్నట్లుగా రూల్స్ పెట్టుకోవాలని సెటైర్ వేశారు. ‘టెస్టు క్రికెట్‌కు ఇలాంటి పిచ్ అసలు అక్కర్లేదు. తొలి 3 రోజుల పాటు మరీ ఫ్లాట్‌గా ఉంది. టెస్టుల్లో బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉండాలి’ అని పేర్కొన్నారు.
News October 11, 2024
జేసీ ప్రభాకర్‌తో నాకు ప్రాణహాని: కేతిరెడ్డి
AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ‘2006లో మా అన్న సూర్యప్రతాప్‌ను చంపారు. నన్నూ అలాగే హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎస్పీ జగదీశ్ సహకరిస్తున్నారు. ప్రస్తుతం నాపై మూడు మర్డర్ కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలో జేసీ ముఠా ఆగడాలు ఎక్కువయ్యాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.