News March 3, 2025
Stock Markets: బలం ప్రదర్శిస్తున్న ఆటో షేర్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అంతర్జాతీయ అనిశ్చితే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,103 (-21), సెన్సెక్స్ 73,096 (-102) వద్ద కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి సేల్స్ డేటా మెరుగ్గా ఉండటంతో ఆటో షేర్లు పుంజుకున్నాయి. ఐటీ, ఫైనాన్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. అల్ట్రాటెక్ సెమ్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, గ్రాసిమ్, విప్రో టాప్ గెయినర్స్.
Similar News
News March 20, 2025
రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు తీసుకెళ్లకూడదు.
* ALL THE BEST
News March 20, 2025
రేపు 49 మండలాల్లో వడగాలులు

AP: రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో <
News March 20, 2025
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్.. చివరికి!

కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి యూట్యూబ్ సాయంతో ఆపరేషన్‌కు ప్రయత్నించి ఆస్పత్రి పాలయ్యాడు. UP మధురలో ఈ ఘటన జరిగింది. అనేక మంది వైద్యులను సంప్రదించినా రాజబాబు(32)కు కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. దీంతో మత్తు ఇంజెక్షన్, ఇతర సామగ్రి కొని ఆపరేషన్ మొదలుపెట్టాడు. మత్తు ప్రభావం తగ్గడంతో నొప్పి ఎక్కువై అరుస్తూ బయటికి పరిగెత్తగా, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.