News March 27, 2025
Stock Markets: బ్యాంక్, ఫైనాన్స్ షేర్ల జోరు

స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే లభించినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,560 (73), సెన్సెక్స్ 77,570 (275) వద్ద ట్రేడవుతున్నాయి. PSU బ్యాంక్స్, PSE, CPSE, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, చమురు, కమోడిటీస్, ఇన్ఫ్రా, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు కుంగాయి. విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటో, LT టాప్ గెయినర్స్.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

పహల్‌గామ్‌లో టూరిస్టులపై నిన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుడు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.
News April 23, 2025
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: CM చంద్రబాబు

AP: పహల్‌గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి CM చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామన్నారు. చంద్రమౌళితో పాటు కావలికి చెందిన మరో వ్యక్తి మరణించగా, ఇరు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉగ్రదాడి జరిగిందని, సరిహద్దుల్లో చొరబాటుదారులను సమర్థంగా అడ్డుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
News April 23, 2025
నేడు అర్ధరాత్రి ఓటీటీలోకి ‘ఎంపురాన్’

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.280 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగానూ రికార్డు సృష్టించింది.