News December 3, 2024
STOCK MARKETS: బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల జోరు

స్టాక్ మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఈ వారం RBI MPC సమావేశాలు ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 24,321 (47), సెన్సెక్స్ 80,400 (153) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, మీడియా, PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. FMCG షేర్లపై అమ్మకాల ఒత్తిడి ఉంది. ITC, TRENT, AIRTEL, SUNPHARMA టాప్ లూజర్స్.
Similar News
News January 18, 2026
నేటి నుంచి నాగోబా జాతర

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.
News January 18, 2026
దానిమ్మలో ‘భగవా’ రకం ప్రత్యేకం

దానిమ్మలో చీడపీడల బెడద ఎక్కువ. అందుకే ఈ పంటను చాలా జాగ్రత్తగా సాగు చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన భగవా దానిమ్మ రకం ప్రత్యేకమైనది. కాయ సైజు పెద్దగా ఆకర్షణీయమైన కుంకుమ రంగులో ఉండటంతో పాటు రుచి చాలా తియ్యగా ఉంటుంది. దీనిపైన తొక్క కూడా మందంగా ఉంటుంది. ఇతర రకాలతో పోలిస్తే భగవా రకం పండ్లు చీడపీడలు, తెగుళ్లను తట్టుకొని మచ్చలకు తక్కువగా గురవుతాయి. మార్కెట్‌లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది.
News January 18, 2026
నేషనల్ టెస్ట్ హౌస్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


