News August 14, 2025
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ట్రంప్-పుతిన్ రేపు భేటీ కానున్న వేళ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. Sensex 57 పాయింట్లు లాభపడి 80,597 వద్ద సెటిల్ అయ్యింది. Nifty 11 పాయింట్ల లాభంతో 24,631 వద్ద స్థిరపడింది. విప్రో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, మారుతీ సుజుకీ, టైటాన్ షేర్లు లాభపడగా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.
Similar News
News April 18, 2026
ఎండాకాలంలో మీ ఫోన్ వేడెక్కుతోందా?

వేసవిలో తీవ్రమైన వేడి వల్ల స్మార్ట్‌ఫోన్లు త్వరగా వేడెక్కడమే కాకుండా వాటి పనితీరూ నెమ్మదిస్తోంది. ఓవర్ హీట్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలొస్తుంటాయి. వీటిని నివారించేందుకు ఫోన్‌ను నేరుగా ఎండలో వాడకూడదని, బ్యాక్ కవర్ తీసేసి ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రైట్‌నెస్ తగ్గించడం, అవసరం లేనప్పుడు డేటా, బ్లూటూత్ ఆఫ్ చేస్తే బ్యాటరీ లైఫ్ కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
News April 18, 2026
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఇవాళ వర్ష సూచన ఉంది. ఏపీలోని విశాఖ, మన్యం, అల్లూరి, పోలవరం, ప.గో, ఏలూరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వానలు పడొచ్చని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఏపీలోని 27 మండలాల్లో, TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచనున్నాయి.
News April 18, 2026
కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.


