News February 1, 2025

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

స్వల్ప లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 77,637.01(క్రితం 77,500.57) వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభం కాగా బడ్జెట్ నేపథ్యంలో లాభ-నష్టాల మధ్య కదలాడి చివరకు 5 పాయింట్ల లాభంతో 77,505.96వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 23,482 వద్ద రోజును ముగించింది. టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు నష్టాలు చవిచూశాయి.

Similar News

News February 17, 2026

ఎవరికి ఏ హెయిర్ స్టైల్ అంటే?

image

ట్రెండ్ అయ్యే ప్రతి హెయిర్ స్టైల్ అందరికీ సెట్ కాదంటున్నారు నిపుణులు. ఫేస్ షేప్‌ని బట్టి హెయిర్ స్టైల్ ఎంచుకోవాలంటున్నారు. రౌండ్, స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్నవారికి బ్యాంగ్స్ బావుంటాయి. జుట్టు కెరటాల్లా అందంగా కనిపించాలంటే లాంగ్ కర్టెన్ బ్యాంగ్స్ చేయించుకోవాలి. రౌండ్ షేప్ ఫేస్ ఉన్నవారికి ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ బావుంటాయి. దీంతో జుట్టు ఒత్తుగా కనిపించడంతో పాటు అన్ని డ్రెస్సుల మీదకీ సెట్ అవుతుంది.

News February 17, 2026

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

TG: CM రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఈనెల 23న జరగనుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై దీనిలో చర్చించనున్నారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాగా CM రేవంత్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు. MH CM ఆహ్వానం మేరకు అక్కడ జరిగే ‘క్లైమెట్ వీక్’లో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై ప్రసంగించనున్నారు.

News February 17, 2026

సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

image

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్‌ (కోల్‌కతాలో)తో తలపడనుంది.