News August 13, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 80,540 వద్ద, నిఫ్టీ 132 లాభంతో 24,619 వద్ద ముగిశాయి. అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, సిప్లా సంస్థల షేర్లు లాభపడగా.. ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్, టైటాన్ కంపెనీ, ITC, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
Similar News
News April 18, 2026
విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
News April 18, 2026
గూగుల్, మెటాకు భారతీరెడ్డి లీగల్ నోటీసులు

గూగుల్, మెటా, X, యూట్యూబ్‌కు వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తనపై చేసిన తప్పుడు పోస్టులు, పరువుకు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కావాలనే తనను టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారని పేర్కొన్నారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. థింక్ ఆంధ్ర, M9 న్యూస్ సంస్థలకూ నోటీసులు పంపారు.
News April 18, 2026
రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్‌లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.


