News April 4, 2025
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల భయాలు, మాంద్యం ఆందోళనలతో అమెరికాలో మదుపర్లు భారీగా విక్రయించారు. దీంతో అక్కడి సూచీలు 5ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా సింగిల్-డే నష్టాల్ని నమోదు చేశాయి. భారత మార్కెట్లూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 75,364 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 345 పాయింట్ల నష్టంతో 22,904 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Similar News
News January 19, 2026
విద్యార్థిగా సీఎం రేవంత్

TG: యూఎస్ హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారనున్నారు. కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ‘లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ’ ప్రోగ్రామ్‌కు ఆయన ఈ నెల 25-30 వరకు హాజరవుతారని CMO తెలిపింది. మొత్తం 20దేశాల నుంచి నేతలు ఈ క్లాసులకు హాజరుకానున్నారు. పలు అంశాలపై ఆయన అసైన్‌మెంట్స్‌తోపాటు హోంవర్క్ కూడా చేయనున్నారు. భారత్ నుంచి సీఎం హోదాలో హాజరవుతున్న తొలి వ్యక్తి రేవంతే.
News January 18, 2026
ఎగ్జామ్ లేకుండానే.. నెలకు రూ.12,300 స్టైపండ్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APలో 11, తెలంగాణలో 17 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాషపై పట్టు ఉండాలి. వయసు 20-28 ఏళ్లు. ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. నెలకు రూ.12,300 స్టైపండ్ ఇస్తారు. అప్లికేషన్లకు చివరి తేదీ JAN 25. 12వ తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తి వివరాల కోసం <
News January 18, 2026
తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం: CM

TG: చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవని సీఎం రేవంత్ మేడారంలో అన్నారు. ‘ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ప్రజా కంఠక పాలనను గద్దె దించాలని ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించా. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జీవితంలో ఏం చేశామని వెనక్కితిరిగి చూసుకుంటే సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకుంటా’ అని తెలిపారు.


