News July 11, 2024

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ముగిశాయి. ఓ దశలో 400కుపైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా కోలుకుంది. 79,897 (-27) వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,315 వద్ద స్థిరపడింది. ONGC, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.

Similar News

News December 5, 2025

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల జోరు

image

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో రోజున వార్డు సభ్యులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజున కేవలం 175 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజున భారీగా 864 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 236 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాలానగర్ నుంచి 231, భూత్పూర్ 155, మూసాపేట 126, అడ్డాకుల 116 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.

News December 5, 2025

పుతిన్ పర్యటన.. నేడు కీలకం!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 11.50గం.కు <<18467026>>హైదరాబాద్‌ హౌస్‌<<>>లో ఈ మీటింగ్ జరగనుంది. రక్షణ బంధాల బలోపేతం, వాణిజ్యం, పౌర అణు ఇంధన సహకారం వంటి అంశాలపై PM మోదీతో చర్చించనున్నారు. S-400, మిసైళ్ల కొనుగోలు, రూపే-మిర్ అనుసంధానం సహా 25 వరకు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అధునాతన S-500 వ్యవస్థ, SU-57 విమానాల కొనుగోలుపైనా చర్చలు జరపనున్నారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.