News February 18, 2025

Stock Markets: ఐటీ తప్ప అన్నీ…

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ 22,917 (-40), సెన్సెక్స్ 75,920 (-70) వద్ద చలిస్తున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పటికే ఓవర్‌సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో కౌంటర్ ర్యాలీకి అవకాశం ఉంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్.

Similar News

News March 23, 2025

ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

image

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్‌గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.

News March 23, 2025

CUET UG దరఖాస్తు గడువు పెంపు

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువును NTA పొడిగించింది. ఈనెల 24 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చు. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.

News March 23, 2025

పైరవీలు లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: భట్టి

image

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను పైరవీలు లేకుండా, పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను Dy.CM భట్టి విక్రమార్క ఆదేశించారు. APR 5లోగా దరఖాస్తులు స్వీకరించి, APR 6 నుంచి మండల స్థాయిలో స్క్రూటినీ, ఆ తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్ వచ్చాక లబ్ధిదారులను ప్రకటించాలన్నారు. JUNE 2 నుంచి మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు.

error: Content is protected !!