News December 13, 2024

STOCK MARKETS: భారీ నష్టాలు తప్పవేమో!

image

స్టాక్‌మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడొచ్చు. NOVలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గడం శుభసూచకం. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నాయి. నిన్న EU, US సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిక్కీ 400, గిఫ్ట్ నిఫ్టీ 94 పాయింట్ల మేర పతనమయ్యాయి. USD/INR మరింత బలహీనపడుతోంది. STOCKS TO WATCH: HAL, Ashok Leyland, GR Infra, Zomato, Yes Bank, CRISIL, Adani Green

Similar News

News January 23, 2025

ఓలా, ఉబర్‌ సంస్థలకు కేంద్రం నోటీసులు

image

క్యాబ్‌ బుక్‌ చేసుకునేవారికి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఛార్జ్ వేస్తున్నారనే <<15225725>>ఫిర్యాదులపై<<>> కేంద్రం చర్యలకు దిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించాలని కోరింది. ఐఫోన్‌లో రైడ్‌ బుక్‌ చేస్తే ఒకలా, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో బుక్‌ చేస్తే ఇంకొకలా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

News January 23, 2025

పాపడాలు అమ్మి రోజుకు రూ.10వేలు సంపాదన

image

పొట్టకూటి కోసం పాపడాలమ్మే చక్రధర్ రాణా రోజుకు రూ.10వేలు సంపాదిస్తున్నారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉడాలా వీధుల్లో ఈయన 50 ఏళ్లుగా పాపడాలు అమ్ముతున్నారు. రోజూ 30-40 కిలోమీటర్లు నడిచి స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఒక్కటి రూ.10 చొప్పున రోజూ వెయ్యి పీసులు అమ్మి రూ.10వేలు సంపాదిస్తున్నారు. తొలినాళ్లలో ఒక్కోటి 5 పైసలకు అమ్మేవారు.

News January 23, 2025

దావోస్ ఖర్చెంత? పెట్టుబడులు ఎన్ని?: అంబటి

image

AP: దావోస్ నుంచి ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులు తెచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘దావోస్ వెళ్లి రావడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దావోస్ నుంచి పెట్టుబడులు ఏ మేరకు తెచ్చారు? తెలియపరిస్తే వినాలని ఉంది!’ అని ట్వీట్ చేశారు.