News June 5, 2024

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

నిన్న భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 1003 పాయింట్ల లాభంతో 73,082 వద్ద.. నిఫ్టీ 331 పాయింట్ల లాభంతో 22,216 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. HUL, హీరో మోటోకార్ప్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా..BPCL, SBI, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న సెన్సెక్స్ 4,390, నిఫ్టీ 1379 పాయింట్లు నష్టపోయాయి.

Similar News

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

image

ఏపీలో MLA, MP స్థానాలు <<19460921>>పెంపుపై <<>>కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ సీట్ల సంఖ్య 50శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10 MLA సీట్లు 15కు పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు ఎంపీతో పాటు కొన్ని నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ కింద ఉన్నాయి. కొత్త బిల్లుతో జిల్లాలోనే 2 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది.

News March 24, 2026

వంటగ్యాస్.. భారత్‌కు శుభవార్త

image

దేశంలో వంటగ్యాస్ కొరత వేళ హార్ముజ్ జలసంధిని దాటుకొని మరో 2 నౌకలు భారత్‌కు వస్తున్నాయి. జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే ఎల్పీజీ నౌకలు నిన్న సురక్షితంగా హార్ముజ్ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాబోయే 2 రోజుల్లో ఇవి భారత పోర్టులకు చేరుకోనున్నాయి. వీటిలో సుమారు 92వేల టన్నుల ఎల్పీజీ ఉంది. కాగా ఇప్పటికే <<19419185>>శివాలిక్<<>>, నందాదేవి, జగ్ లాడ్కీ షిప్పులు LPGని తీసుకొచ్చాయి.

News March 24, 2026

అనిల్ ‘మల్టీస్టారర్’ జూన్‌లో షురూ!

image

వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌తో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే మల్టీస్టారర్ మూవీ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని సమాచారం. కామెడీ, యాక్షన్ అంశాలతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఖరారు చేశారని, మరో కథానాయిక కోసం మేకర్స్ పలు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరికి షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.