News June 5, 2024
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నిన్న భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 1003 పాయింట్ల లాభంతో 73,082 వద్ద.. నిఫ్టీ 331 పాయింట్ల లాభంతో 22,216 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. HUL, హీరో మోటోకార్ప్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా..BPCL, SBI, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న సెన్సెక్స్ 4,390, నిఫ్టీ 1379 పాయింట్లు నష్టపోయాయి.
Similar News
News December 12, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మిరపకు నల్ల తామర ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీని వల్ల మిరప పంటకు నల్ల తామర ముప్పు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పురుగులు మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీంతో ఆకులు, కాయలు రాలిపోతాయి. మొక్క పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల వృద్ధి ఎక్కువ. ఆకు ముడత వ్యాప్తికి నల్ల తామర పురుగులు వాహకాలుగా పనిచేస్తాయి.
News December 12, 2025
ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మౌంటెయిన్స్ 2002 వంటివి ఆమె చేపట్టారు.
News December 12, 2025
తారస్థాయికి కూటమి అరాచక పాలన: అనిల్

AP: పోలీసులను అడ్డుపెట్టుకుని TDP రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధంలేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి YSRCPపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.


