News December 17, 2024
STOCK MARKETS: ఫెడ్ నిర్ణయంపై ఆసక్తి..
స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై నష్టాల్లోకి జారుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. నిన్న EU, US సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నేడు నిక్కీ, తైవాన్ సూచీలు భారీ లాభాల్లో మొదలైనప్పటికీ గిఫ్ట్ నిఫ్టీ 39PTS పతనమవ్వడం ప్రతికూలతను సూచిస్తోంది. నిఫ్టీ సపోర్టు 24,640, రెసిస్టెన్సీ 24760 వద్ద ఉన్నాయి. USD/INR వీక్‌గా ఉంది. ఫెడ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
Similar News
News January 25, 2025
ఈ-కామర్స్ సంస్థలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
AP: గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంలో ఈ-కామర్స్ సంస్థలకు Dy CM పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ‘అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను వాడకపోతే అవి నిరుపయోగ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నట్లు నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. RBI గైడ్‌లైన్స్ ప్రకారం కార్డులకు ఏడాది పరిమితి ఉండాలి. ఆ తర్వాత నోటీసులు ఇచ్చాక KYC లింక్ అయిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాలి’ అని స్పష్టం చేశారు.
News January 25, 2025
విజయసాయి బీజేపీలో చేరడం లేదు: పురందీశ్వరి
AP: విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. ‘విజయసాయి బీజేపీలో చేరుతారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారా? ప్రతి సభ్యుడికి వారిద్దరూ సపోర్ట్‌గా ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకు సపోర్ట్ చేశారని మాత్రమే VSR అన్నారు’ అని గుర్తుచేశారు.
News January 25, 2025
ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి!
ఆఫ్రికా దేశం సూడాన్‌లోని ఆసుపత్రిపై డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 2023 ఏప్రిల్ నుంచి ఈ దేశంలో సూడాన్ ఆర్మీకి అక్కడ రాపిడ్ ఫోర్స్‌కి మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొన్ని వారాల క్రితం ఆసుపత్రిపై ఇదే తరహా డ్రోన్ దాడి జరిగినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.