News March 7, 2025
Stock Markets: ఆచితూచి కొంటున్న ఇన్వెస్టర్లు

స్టాక్‌మార్కెట్లు మోస్తరు నష్టాల్లో చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, వీకెండ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 22,486 (-60), సెన్సెక్స్ 74,093 (-250) వద్ద ట్రేడవుతున్నాయి. మీడియా, మెటల్, ఆటో, రియాల్టి షేర్లు ఎగిశాయి. ఐటీ, FMCG, బ్యాంకు, పీఎస్ఈ, ఎనర్జీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. HDFC LIFE, BEL, BAJAJ AUTO, HERO MOTO టాప్ గెయినర్స్.
Similar News
News March 20, 2025
వేసవిలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త!

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు పలు సూచనలు చేశారు. 1. టైర్లలో ఎయిర్ ప్రెషర్‌ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే వేడికి టైర్లు పేలిపోయే అవకాశం ఉంది. 2. ఇంజిన్ కూలెంట్ స్థాయిని చెక్ చేయండి. అవసరమైతే రీఫిల్ చేయండి. 3. బ్యాటరీ స్థితిని తనిఖీ చేయండి. 4. ఏసీ వ్యవస్థ పనిచేస్తుందో లేదో చూడండి.
* పగటిపూట ప్రయాణాలు మానుకోండి: పోలీసులు
News March 20, 2025
ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.
News March 20, 2025
చరిత్ర సృష్టించిన ‘ఛావా’

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.