News February 1, 2025
Stock Markets: బడ్జెట్‌కు ముందు మార్కెట్లు అప్

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 25,555 (+50), సెన్సెక్స్ 77,695 (+210) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీసీ హోటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బీఈఎల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్. హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, గ్రాసిమ్, ట్రెండ్ టాప్ లూజర్స్.
Similar News
News February 7, 2025
జనసేనకు సూపర్ న్యూస్.. తెలంగాణలోనూ పార్టీకి గుర్తింపు

జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో <<15218607>>ప్రాంతీయ పార్టీగా<<>> గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ SEC ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. ఇకపై గాజు గ్లాసు చిహ్నాన్ని ఎవరికీ కేటాయించరు.
News February 7, 2025
‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్రం

TG: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ MP బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయమంత్రి రాజ్ భూషణ్ చౌదరి పైవిధంగా సమాధానమిచ్చారు. టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన చిక్కులు అడ్డొస్తున్నాయన్నారు. AP, TGలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. దీంతో విభజన చట్టం హామీని కేంద్రం విస్మరించిందని INC మండిపడింది.
News February 7, 2025
రేపటి నుంచి TG ఓపెన్ చెస్ టోర్నీ

TG: రేపు, ఎల్లుండి చర్లపల్లిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేట్ చెస్ అసోసియేషన్ (TSTA) తెలిపింది. బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు ఉంటాయని TSTA ప్రెసిడెంట్ KS ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని, వివరాలకు 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.