News August 12, 2024
Stock Markets: క్రాషేం లేదు.. స్వల్ప నష్టాలే

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం BSE సెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 79,447, NSE నిఫ్టీ 80 పాయింట్లు ఎరుపెక్కి 24,286 వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 72,321 వద్ద ట్రేడవుతోంది. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ 3, అదానీ పోర్ట్స్ 2 శాతానికి పైగా నష్టపోయాయి.
Similar News
News November 11, 2025
వేదాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా?

వేదాలు అపౌరుషేయాలు. ఇవి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం నుంచి సహజంగా వెలువడినవి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించాలని సంకల్పించగా, ఆయనకు మొదట ‘ఓం’ అనే పవిత్ర ప్రణవనాదం వినిపించింది. బ్రహ్మ ఆ ఓంకార నాదాన్ని ధ్యానంలో గ్రహించి, ఆ పరమశబ్దాన్ని వేదజ్ఞానం రూపంలో మహర్షులు, రుషుల ద్వారా లోకానికి వెలువరించారు. అందుకే వేదాలను సనాతన ధర్మానికి మూలమైన దివ్యజ్ఞానంగా భావిస్తారు. <<-se>>#VedikVibes<<>>
News November 11, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

SBI 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎఫ్పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in/
News November 11, 2025
భవిష్యత్తు బంగారం ‘రాగి’: అనలిస్టులు

ఈవీలు, సోలార్ ప్యానెల్స్, 5G టవర్లు, డేటా సెంటర్ల నిర్మాణంలో ఉపయోగించే రాగి విలువ పెరుగుతోందని అనలిస్టులు చెబుతున్నారు. ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఇండోనేషియాలోని కాపర్ మైన్స్ వరదలు, ప్రమాదాలతో షట్డౌన్ అంచున ఉన్నాయి. 2026కు 6 లక్షల టన్నుల రాగి కొరత ఏర్పడవచ్చు. కొత్త మైన్స్ తెరిచేందుకు 10-15 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో టన్ను రాగి 11-14 వేల డాలర్లకు చేరుకోవచ్చని చెబుతున్నారు.


