News March 3, 2025
Stock Markets: నష్టాల నుంచి రికవరీ..

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,119 (-5), సెన్సెక్స్ 73,085 (-112) వద్ద స్థిరపడ్డాయి. భారీ నష్టాల నుంచి సూచీలు మధ్యాహ్నం రికవర్ అయ్యాయి. ఐటీ, మెటల్, రియాల్టి, హెల్త్‌కేర్, ఫార్మా, కన్జంప్షన్ షేర్లు ఎగిశాయి. బ్యాంకు, మీడియా, O&G స్టాక్స్ ఎరుపెక్కాయి. బీఈఎల్, గ్రాసిమ్, ఐచర్ మోటార్స్, JSW స్టీల్, BCPL టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, కోల్ఇండియా, RIL, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC టాప్ లూజర్స్.
Similar News
News March 24, 2025
IPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఢిల్లీతో మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ 209 పరుగులు చేసింది. LSG ఓపెనర్ మిచెల్ మార్ష్(72), పూరన్(75) విధ్వంసంతో బౌలర్లకు చుక్కలు చూపించారు. చివర్లో DC బౌలర్లు వికెట్లు తీసి పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3, కుల్దీప్ 2, ముకేశ్, విప్రాజ్ తలో వికెట్ తీశారు. ఢిల్లీ టార్గెట్ 210.
News March 24, 2025
BREAKING: మంత్రి వర్గ విస్తరణకు ఓకే!

TG: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల భేటీ ముగిసింది. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 4 మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఉగాది రోజున ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
News March 24, 2025
కంగ్రాట్స్ రాజీవ్.. మళ్లీ కత్తి దూసేందుకు సిద్ధం: శశి థరూర్

BJP కేరళ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి కత్తులు దూసేందుకు ఎదురు చూస్తున్నానని సరదాగా కామెంట్ చేశారు. వేర్వేరు పార్టీలైనప్పటికీ కొన్ని రోజులుగా వీరిద్దరూ కొన్ని అంశాలపై ఒకే రకమైన వాయిస్ వినిపిస్తున్నారు. 2024 LS ఎన్నికల్లో తిరువనంతపురంలో నువ్వానేనా అన్నట్టు జరిగిన పోటీలో రాజీవ్‌పై శశి 15వేల ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు.