News November 19, 2024
STOCK MARKETS: రూ.3లక్షల కోట్ల ప్రాఫిట్
గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్ దూకుడు తగ్గడం మరో కారణం. నిఫ్టీ 23,680 (+226), సెన్సెక్స్ 77,973 (+634) వద్ద చలిస్తున్నాయి. ఉదయాన్నే మదుపరులు రూ.3లక్షల కోట్లమేర సంపద పోగేశారు. ఆటో, IT, మీడియా, రియాల్టి, PSU బ్యాంకు, OIL & GAS షేర్లకు గిరాకీ పెరిగింది. TRENT, ONGC, M&M టాప్ గెయినర్స్.
Similar News
News December 3, 2024
10-12 ఏళ్లు మాతోనే పంత్: సంజీవ్ గొయెంకా
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ తమతోపాటు 10-12 ఏళ్లు ఉంటారని లక్నో జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా అభిప్రాయపడ్డారు. వేలంలో ఆయనను దక్కించుకోవడంలో తాము సక్సెస్ అయ్యామన్నారు. ‘ప్రస్తుతం మా జట్టులో నలుగురు లీడర్లు ఉన్నారు. పంత్, మార్‌క్రమ్, పూరన్, మార్ష్ కెప్టెన్సీకి అర్హులే. వీరందరూ గెలవాలనే కసి, తపనతో ఉంటారు. ప్రస్తుతం అన్ని జట్ల కన్నా తమ జట్టే బలంగా, సమతుల్యంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
News December 3, 2024
ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘బ్రెయిన్ రాట్’
‘బ్రెయిన్ రాట్’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది. బ్రెయిన్ రాట్ అంటే మానసిక స్థితి క్షీణించడం, గతి తప్పడం. సోషల్ మీడియాలో అవసరం లేని కంటెంట్‌ను ఎక్కువ చూడటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ ప్రయోజనం లేకుండానే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కాలం గడిపేసేవారికీ ఈ పదం వర్తిస్తుంది. ఈ ఏడాదిలో ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
News December 3, 2024
వలస కార్మికులకు అండగా ఉంటాం: రామ్మోహన్ నాయుడు
AP: విదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బాధితులకు ఇండియాకు రప్పించేందుకు విదేశాంగశాఖ సహాయం కోరతామని చెప్పారు. వారికి అవసరమైన ఫుడ్, ఇతర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, వజ్రపుకొత్తూరు, కంచిలి, నందిగాంకు చెందిన దాదాపు 30 మంది వలస కార్మికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.