News February 4, 2025
Stock Markets పరుగులు: ఇన్వెస్టర్లకు రూ.7లక్షల కోట్ల ప్రాఫిట్

బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,739 (+378), సెన్సెక్స్ 78,538 (+1397) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లు దుమ్మురేపాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌టీ, బీఈఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా, హీరోమోటో, నెస్లే ఇండియా టాప్ లూజర్స్. నేడు ఇన్వెస్టర్లు రూ.7లక్షల కోట్లు ఆర్జించారు.
Similar News
News February 8, 2026
కలర్ ఫుల్‌గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్‌లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కొత్త టేకింగ్‌తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.
News February 8, 2026
రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.
News February 8, 2026
సెట్‌లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్‌లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్‌ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్‌తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.


