News December 13, 2024

స్టాక్ మార్కెట్స్: -1000 నుంచి +400కు సెన్సెక్స్

image

స్టాక్‌మార్కెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పడిపోయి మళ్లీ పెరుగుతున్నాయి. సూచీల దిశ ఏంటో తెలియక ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. నిఫ్టీ 300 పాయింట్ల నష్టాన్ని పూడ్చుకొని 114 పాయింట్ల లాభంతో 24,662 వద్ద ట్రేడవుతోంది. -1000 పాయింట్ల నుంచి పుంజుకొన్న సెన్సెక్స్ 432 పాయింట్ల లాభంతో 81,719 వద్ద కొనసాగుతోంది. IT, FMCG స్టాక్స్ రికవరీకి సాయపడ్డాయి. AIRTEL, HCLTECH, ULTRATECH షేర్లు పెరిగాయి.

Similar News

News December 26, 2024

అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?: CM రేవంత్

image

TG: సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాలనేది నా విధానం’ అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు.

News December 26, 2024

సినీ సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ

image

TG: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, సినీ నిర్మాతలు ఉండే అవకాశముంది. మరోవైపు సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 26, 2024

హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలి: నాగార్జున

image

TG: ఈరోజు రేవంత్‌తో జరిగిన భేటీలో సినీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి’ అని నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగే ఉత్కంఠగా ఉంటుందని మురళీమోహన్ తెలిపారు.