News December 13, 2024

స్టాక్ మార్కెట్స్: -1000 నుంచి +400కు సెన్సెక్స్

image

స్టాక్‌మార్కెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పడిపోయి మళ్లీ పెరుగుతున్నాయి. సూచీల దిశ ఏంటో తెలియక ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. నిఫ్టీ 300 పాయింట్ల నష్టాన్ని పూడ్చుకొని 114 పాయింట్ల లాభంతో 24,662 వద్ద ట్రేడవుతోంది. -1000 పాయింట్ల నుంచి పుంజుకొన్న సెన్సెక్స్ 432 పాయింట్ల లాభంతో 81,719 వద్ద కొనసాగుతోంది. IT, FMCG స్టాక్స్ రికవరీకి సాయపడ్డాయి. AIRTEL, HCLTECH, ULTRATECH షేర్లు పెరిగాయి.

Similar News

News January 17, 2025

సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు

image

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.

News January 17, 2025

ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదు: కుమారస్వామి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తేవడమే కేంద్రం లక్ష్యమని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రానున్న రెండు, మూడేళ్లలో ప్లాంట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తామన్నారు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదని స్పష్టం చేశారు. ఇవాళ ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ మొదటిదేనని, భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సాయాల ప్రకటనలు చేస్తామని పేర్కొన్నారు.

News January 17, 2025

ప్రధాని మోదీకి ధన్యవాదాలు: లోకేశ్ హర్షం

image

స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధాని మోదీ ఆమోదించిన రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్లాంట్‌కు పెద్దపీట వేసిన ప్రధాని మోదీకి ఈ క్రెడిట్ దక్కాలి. కేంద్రానికి ధన్యవాదాలు’ అని తెలిపారు.