News January 1, 2025
మధ్యాహ్నం దూకుడు పెంచిన స్టాక్‌మార్కెట్లు..
ఉదయం ఫ్లాటుగా మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. ప్రస్తుతం భారీ లాభాల్లో చలిస్తున్నాయి. సెన్సెక్స్ 78,490 (+353), నిఫ్టీ 23,738 (+94) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, IT, BANKING షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. తక్కువకే దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. 2025లో ఔట్‌లుక్ మెరుగ్గా లేకపోవడంతో అప్రమత్తత పాటిస్తున్నారు. M&M, LT, ASIAN PAINTS టాప్ గెయినర్స్.
Similar News
News January 23, 2025
స్వదేశానికి పయనమైన చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు దావోస్ నుంచి స్వదేశానికి పయనమయ్యారు. మూడు రోజులకు పైగా సాగిన పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి మెర్‌ఎస్కే వంటి సంస్థలతో ఆయన బృందంతో కలిసి చర్చలు జరిపారు. కాగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు.
News January 23, 2025
మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు
FEB 1 నుంచి కార్ల ధరలను పెంచబోతున్నట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.1500 నుంచి రూ.32500 వరకు పెంపు ఉంటుందని తెలిపింది. ముడిసరుకులు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంది. వ్యాగన్ Rపై రూ.13000, బ్రెజాపై రూ.20వేలు, ఎర్టిగాపై రూ.15వేలు, స్విఫ్ట్‌పై రూ.5వేలు, ఆల్టో K10పై రూ.19500, బలెనోపై రూ.9వేలు, గ్రాండ్ విటారాపై రూ.25వేల వరకు ధరల పెంపు ఉంటుందని తెలిపింది.
News January 23, 2025
రోహిత్ చివరి 17 ఇన్నింగ్సుల స్కోర్లు ఇవే
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొద్దిరోజులుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ (3) దారుణంగా విఫలమయ్యారు. చివరి 17 ఇన్నింగ్సు(అన్ని ఫార్మాట్లు)ల్లో ఆయన ఒకే ఒక ఫిఫ్టీ సాధించారు. ఐదు సార్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేశారు. 17 ఇన్నింగ్సుల్లో 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 3, 6, 10, 3, 9, 3 పరుగులు చేశారు.