News February 4, 2025

Stock Markets: తేడా 0.3 శాతమే

image

భారత స్టాక్‌మార్కెట్లపై DIIs పట్టు పెరుగుతోంది. పెట్టుబడుల పరంగా FIIsతో పోలిస్తే 0.3 శాతమే వెనుకంజలో ఉన్నారు. NSEలో ఫారిన్ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 12 నెలల కనిష్ఠమైన 17.23 శాతానికి పడిపోయాయి. మరోవైపు DIIs హోల్డింగ్స్ 16.9 శాతానికి చేరాయి. ఇక MFs హోల్డింగ్స్ జీవితకాల గరిష్ఠమైన 9.9% వద్ద ఉన్నాయి. 2015లో మన మార్కెట్లలో FIIs పెట్టుబడులు DIIs కన్నా రెట్టింపు ఉండేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది.

Similar News

News February 9, 2025

నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

News February 9, 2025

బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు!

image

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90గా ఉంది. గరిష్ఠ టికెట్ ధరను రూ.60 నుంచి రూ.90కి పెంచారు. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. 0-2kmsకి రూ.10, 2-4kmsకి 20, 6-8kms 40, 8-10kms 50, 20-25kms 80, 25-30kmsకి 90 ఛార్జ్ చేస్తారు. స్మార్ట్ కార్డులపై 5% డిస్కౌంట్‌ను కొనసాగించనున్నారు. కాగా ఇటీవల కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలను 15% పెంచిన సంగతి తెలిసిందే.

News February 9, 2025

రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

error: Content is protected !!