News February 10, 2025
Stock Markets: ట్రంప్ దెబ్బకు మళ్లీ విలవిల

స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో మరిన్ని దేశాలపై టారిఫ్స్ అమలు చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 23,452 (-107), సెన్సెక్స్ 77,514 (-341) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG షేర్లకు డిమాండ్ ఉంది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. బ్రిటానియా, టాటా కన్జూమర్, HUL, నెస్లే ఇండియా, M&M టాప్ గెయినర్స్.
Similar News
News March 17, 2025
కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టివేత

కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి మళ్లీ CBI విచారణ చేయించాలని ఆమె తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేస్తూ.. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కొనసాగించవచ్చని సూచించింది. గతేడాది ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. నిందితుడు సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
News March 17, 2025
TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ, మంగళ వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఇవ్వనుండగా, ఒక్కో లేఖపై ఆరుగురికి దర్శనం కల్పిస్తారు.
News March 17, 2025
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్? నిజమిదే!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలకు ఆయన టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘మమ్ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. రంజాన్ కావడంతో ఉపవాసం చేస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్స్‌నుంచి విరామం తీసుకున్నారు. ప్రచారంలో ఉన్నది పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది. కాగా తన తర్వాతి సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో కలిసి నటించనుండటం విశేషం.