News April 27, 2024
రాయి దాడి కేసు.. సబ్ జైలుకు సతీశ్
AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ కుమార్‌కు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు కోర్టు అతడికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని సబ్ జైలుకు తరలించారు. కాగా మూడు రోజులపాటు కుట్రకోణంపై సతీశ్‌ను పోలీసులు లోతుగా విచారించారు.
Similar News
News November 17, 2024
కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డుస్థాయిలో ధాన్యం: CM
కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని CM రేవంత్ తెలిపారు. 2024లో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ట్వీట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న BRS తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత సాధించారు’ అని తెలిపారు.
News November 17, 2024
కన్నడ నేర్చుకోవాల్సిందే: ZOHO CEO
బెంగళూరులో నివసించే ఇతర రాష్ట్రాల వారు కచ్చితంగా కన్నడ నేర్చుకోవాలని ZOHO CEO శ్రీధర్ వేంబు వ్యాఖ్యానించారు. భాష నేర్చుకోకపోతే అది స్థానికతను అగౌరవపరచడమే అవుతుందన్నారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. రోజూ వెయ్యి పనులు చేయాల్సిన పరిస్థితిలో ఏదైనా కొత్తగా నేర్చుకొనే విధానం ఆర్గానిక్‌గా ఉండాలని ఒకరు, చుట్టూ 90% ఇతర రాష్ట్రాల వారే ఉంటే కొత్త భాష ఎలా సాధ్యమంటూ మరొకరు పేర్కొన్నారు.
News November 17, 2024
వృద్ధులు, వికలాంగులకే ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు’!
AP: ప్రజలు ఎక్కడి నుంచైనా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తీసుకొచ్చిన ‘ఎనీవేర్’ విధానంపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. దీనిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ విధానాన్ని 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మేరకు అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదిస్తే వెంటనే అమల్లోకి రానున్నాయి.