News September 5, 2024
బుల్డోజర్ రాజకీయాలు మానేయండి: మాయావతి

బుల్డోజర్ రాజకీయాలు మానుకొని, జనావాసాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్న వన్యప్రాణుల కట్టడికి చర్యలు తీసుకోవాలని UP CM యోగీకి BSP చీఫ్ మాయావతి సూచించారు. బుల్డోజర్ చర్యలను కోర్టు తప్పుబట్టడంతో BJP-SP మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బుల్డోజర్ చర్యలను బీజేపీ సమర్థించుకోగా, అదే గుర్తుపై పోటీ చేసి గెలవాలని అఖిలేశ్ సవాల్ చేశారు.
Similar News
News December 7, 2025
కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.
News December 7, 2025
ఇంగ్లండ్ చెత్త రికార్డు

యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్గా జో రూట్ ఖాతాలో అన్వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.
News December 7, 2025
సైనికుల క్రమశిక్షణ, సామర్థ్యం చూశాం: రాజ్నాథ్ సింగ్

‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ చూశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పరాక్రమంతో పాటు సంయమనం కూడా చూపారని గుర్తుచేశారు. ఎంత కావాలో అంతే చేశారని, అనుకుంటే మరింత చేసేవారన్నారు. బార్డర్లో మెరుగైన కనెక్టివిటీ భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతోందని చెప్పారు. BRO పూర్తి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్నాథ్ ఈ కామెంట్లు చేశారు.


