News September 5, 2024
బుల్‌డోజర్ రాజకీయాలు మానేయండి: మాయావతి
బుల్‌డోజర్ రాజకీయాలు మానుకొని, జనావాసాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్న వన్యప్రాణుల కట్టడికి చర్యలు తీసుకోవాలని UP CM యోగీకి BSP చీఫ్ మాయావతి సూచించారు. బుల్‌డోజర్ చర్యలను కోర్టు తప్పుబట్టడంతో BJP-SP మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బుల్‌డోజర్ చర్యలను బీజేపీ సమర్థించుకోగా, అదే గుర్తుపై పోటీ చేసి గెలవాలని అఖిలేశ్ సవాల్ చేశారు.
Similar News
News September 19, 2024
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తొలుత ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడో ఓ చోట ఔట్‌డోర్‌లో ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో HYDలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం.
News September 19, 2024
భారత్‌కు మెడల్స్ సాధించడమే లక్ష్యం: మనూ భాకర్
భారత్‌కు మరెన్నో మెడల్స్ సాధించిపెట్టడమే తన ఏకైక లక్ష్యమని ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ తెలిపారు. ఎన్డీటీవీ యువ కాంక్లేవ్‌లో ఆమె పాల్గొన్నారు. ‘షూటింగే నా జీవితం. ఇంకేమీ ఊహించుకోలేను. లైఫ్‌లో వీలైనంత ఎక్కువ కాలం షూటింగ్‌లో ఉంటూ ఇండియాకు మెడల్స్ సాధిస్తా’ అని పేర్కొన్నారు. ఆగ్రహం వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు.. కోపాన్ని ఏదైనా మంచిపని మీదకు మళ్లిస్తానని, క్రీడాకారులకు అది కీలకమని ఆమె వివరించారు.
News September 19, 2024
నీ పని ఇదేనా రేవంతు?: TBJP
TG: CM రేవంత్‌రెడ్డిపై X వేదికగా రాష్ట్ర BJP విమర్శలు గుప్పించింది. ‘నీ పని ఢిల్లీకి సూట్‌కేసులు మోయడమా?, గాంధీ కుటుంబానికి భజన చేయడమా?, తెలంగాణేతరులకు ఉద్యోగాలివ్వడమా?, సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు పెట్టడమా?, బూతులు తిట్టడమా?, నీ సోదరులకు కంపెనీలు పెట్టివ్వడమా?, నీ సొంత కంపెనీలకు ప్రాజెక్టులిప్పించడమా?, పేదల ఇండ్లు కూల్చి ఒవైసీ, తిరుపతిరెడ్డి బంగ్లాలు కాపాడటమా?’ అని ట్వీట్ చేసింది.