News July 17, 2024
ఎర్రమట్టి దిబ్బల తవ్వకం ఆపండి: CMO

AP: వైజాగ్‌లో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా పేరొందిన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిపై సీఎం కార్యాలయం దృష్టి సారించింది. తవ్వకాల్ని ఆపేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే పనుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించింది. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
Similar News
News November 17, 2025
శివ పూజలో తులసిని వాడుతున్నారా?

శివుడికి సంబంధించి ఏ పూజలు నిర్వహించినా అందులో మాల, తీర్థం ఏ రూపంలోనూ తులసిని వినియోగించకూడదనే నియమం ఉంది. శివ పురాణం ప్రకారం.. తులసి వృంద అనే పతివ్రతకు ప్రతిరూపం. ఆమె భర్త జలంధరుడిని శివుడు సంహరించాడు. అప్పుడు శివుడి పూజలో తన పవిత్ర రూపమైన తులసిని వాడరని శాపమిచ్చింది. అందుకే శివుడికి బిల్వపత్రాలు ప్రీతిపాత్రమైనవి. గణపతి పూజలోనూ తులసిని ఉపయోగించరు.
News November 17, 2025
iBomma ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా?

ఇమ్మడి రవి అరెస్టుతో iBomma, బప్పం టీవీ <<18302048>>బ్లాక్ <<>>అయిన విషయం తెలిసిందే. అయితే అవి ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. iBommaకు ముందు ఎన్నో పైరసీ సైట్లు ఉన్నాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. వాటిపైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఐబొమ్మ ప్లేస్‌లోకి అవి వస్తాయంటున్నారు. డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని పేర్కొంటున్నారు. మీరేమంటారు?
News November 17, 2025
కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.


