News July 27, 2024

యుద్ధాన్ని ఆపండి: నెతన్యాహుతో కమలా హారిస్

image

అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో US ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భేటీ అయ్యారు. గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఈ సందర్భంగా ఆయనకు తేల్చిచెప్పినట్లు వెల్లడించారు. ‘యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది. ఇజ్రాయెల్ భద్రతతో ఉండాలి. ఖైదీలందరూ విడుదల కావాలి. గాజాలో పాలస్తీనా ప్రజలకు స్వేచ్ఛ తిరిగిరావాలి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించమని నెతన్యాహుకు చెప్పాను’ అని హారిస్ పేర్కొన్నారు.

Similar News

News October 14, 2024

హ్యాపీ బర్త్ డే లెజెండ్: ఢిల్లీ క్యాపిటల్స్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ విషెస్ తెలిపింది. ‘తన పనిపట్ల ఎంతో కమిటెడ్‌గా ఉంటారు. పేరుకు తగ్గట్లు అంత గంభీరంగా ఉండరు. కానీ, చాలా అగ్రెసివ్, బెస్ట్ టీచర్’ అని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. పైన తెలిపిన వాటిలో పట్టు సాధించిన లెజెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది. గంభీర్ ఇన్నింగ్స్‌లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.

News October 14, 2024

9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర?

image

ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడులకు హమాస్ కుట్ర పన్నినట్లు IDF తెలిపింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టెల్ అవీవ్‌లోని 70 అంతస్తుల భవనం మోషే అవివ్, ఇజ్రాయెల్ టవర్లను నేలమట్టం చేసేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ రికార్డుల్లో ఇరాన్ ప్రతినిధులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ జరిపిన సంభాషణలు కూడా ఉన్నట్లు తెలిపింది.

News October 14, 2024

జోష్‌లో స్టాక్ మార్కెట్లు

image

వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల ప్లస్‌లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ ప్రస్తుతం 81,666 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,037 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. JSW స్టీల్, L&T, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్, రిలయన్స్, NTPC తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు పడిపోయాయి.