News April 27, 2024

హార్దిక్‌ను సూపర్‌స్టార్‌లా చూడటం ఆపాలి: పఠాన్

image

హార్దిక్ పాండ్యను ఓ సూపర్ స్టార్‌లా చూడటం బీసీసీఐ మానుకోవాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికారు. క్రమం తప్పకుండా చక్కటి ప్రదర్శన ఇస్తే తప్ప అతడిని కీలక ఆటగాడిగా పరిగణించొద్దని తేల్చిచెప్పారు. ‘నువ్వు అద్భుతమైన ఆల్‌రౌండర్ అని భావిస్తే అంతర్జాతీయ స్థాయిలో నీ ప్రదర్శన కూడా ఆస్థాయిలో ఉండాలి. హార్దిక్ విషయంలో తనకున్న నైపుణ్యంపై చర్చే తప్ప అది ప్రదర్శనగా మారట్లేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 19, 2026

పవన్‌ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

image

AP Dy.CM పవన్ కళ్యాణ్‌ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.

News April 19, 2026

IPLలో నేడు హోరాహోరీ పోరు

image

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్‌లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్‌లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

News April 19, 2026

భారత్‌తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

image

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.