News January 17, 2025

‘వీరమల్లు’ లాంటి కథలు అరుదుగా వస్తాయి: బాబీ డియోల్

image

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమని బాబీ డియోల్ తెలిపారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చరిత్రలో జరిగిన కథలు ఎమోషనల్‌గానే కాకుండా మాస్‌గానూ ఉంటాయని ఈ స్టోరీ విన్నప్పుడే అర్థమైందన్నారు. ఇలాంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇవాళ మూవీ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది.

Similar News

News February 19, 2025

ఇవాళ అంతర్జాతీయ ‘టగ్ ఆఫ్ వార్’ డే

image

రెండు జట్లు తాడు లాగుతూ పోటీపడే ఆటను టగ్ ఆఫ్ వార్ అంటారు. రెండు జట్ల మధ్య ఒక గీతను గీసి తాడు లాగడంపై పోటీ నిర్వహిస్తారు. ఎనిమిది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రత్యర్థి జట్టును గీత తాకేలా ఎవరైతే లాగుతారో వారే విజేతగా నిలుస్తారు. సరదా కోసం ఆడే ఈ ఆట 1900 నుంచి 1920 వరకు ఒలింపిక్స్‌లో కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఆట ఆడుతుంటారు. మీరూ ఎప్పుడైనా ఆడారా?

News February 19, 2025

మోనాలిసాకు బిగ్ షాక్?

image

కుంభమేళాలో వైరలయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు’ అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు.

News February 19, 2025

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.

error: Content is protected !!