News August 18, 2024
స్త్రీ-2: మూడు రోజుల్లోనే రూ.145 కోట్లు
బాలీవుడ్‌లో హారర్ కామెడీ థ్రిల్లర్ ‘స్త్రీ-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం 3 రోజుల్లోనే రూ.145 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ, రేపు సెలవులు ఉండటంతో త్వరలోనే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని పేర్కొన్నాయి. రూ.50 కోట్ల బడ్జెట్‌తో అమర్ కౌశిక్ ఈ మూవీని తెరకెక్కించారు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్, పంకజ్ కీలక పాత్రల్లో నటించారు.
Similar News
News September 16, 2024
ఢిల్లీ సీఎం రేసులో ‘ఆ ఐదుగురు’
ఢిల్లీ CM రేసులో ఐదుగురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. PWD, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆతిశీ మార్లేనా అందరికన్నా ముందున్నారు. కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు ప్రభుత్వాన్ని ఆమే నడిపించారు. 3సార్లు MLA, మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కు అవకాశం దక్కొచ్చు. రాజ్యసభ సభ్యుడు, పార్టీ వైఖరిని ప్రజలు, మీడియాలో బలంగా చాటే రాఘవ్ చద్దా పేరును కొట్టిపారేయలేరు. సీనియర్లు కైలాష్ గహ్లోత్, సంజయ్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
News September 16, 2024
ఇండియాలో ఎక్కువ మందికి ఉన్న చివరి పేరు ఇదే!
ఒకరిని పోలిన వ్యక్తులు భూమిపై ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఒకే పేరును కలిగిన వాళ్లు వేలల్లో ఉంటారు. అయితే, ఇండియాలో ఎక్కువ మంది తమ చివరి పేరును కుమార్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. అర్జెంటీనాలో గొంజాలెజ్, ఆస్ట్రేలియాలో స్మిత్, బంగ్లాదేశ్‌లో అక్తర్, బ్రెజిల్‌లో డా సిల్వా, కెనడాలో స్మిత్, చైనాలో వాంగ్, ఈజిప్టులో మొహమ్మద్, ఫ్రాన్స్‌లో మార్టిన్ అనే పేర్లు కామన్‌గా పెట్టుకుంటున్నారని ఓ సర్వే పేర్కొంది.
News September 16, 2024
నేడు కొరియాతో టీమ్ ఇండియా సెమీస్ పోరు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఈరోజు సెమీస్ మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొరియాతో ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఐదింటికి ఐదు మ్యాచులనూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన సునాయాసంగా గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. అటు పాక్ కూడా సెమీస్ చేరి ఈరోజు చైనాతో తలపడుతోంది. ఈ నెల 17న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.