News May 13, 2024
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ

TG: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు చెప్పారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ చివరి మూడు గంటలు అలర్ట్‌గా ఉంటామని పేర్కొన్నారు.
Similar News
News February 10, 2026
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

AP: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.1,200 కోట్ల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
News February 10, 2026
ఎల్లుండి నుంచి MLAలకు డిజిటల్ అటెండెన్స్!

AP: అసెంబ్లీకి కొందరు సభ్యులు గైర్హాజరు అవుతుండటంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సభ్యుల ఫింగర్ ప్రింట్స్ నమోదు చేసి.. ఎల్లుండి నుంచి డిజిటల్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే MLA తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. అటు రేపు జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్తారని ఆ పార్టీ నేత బొత్స తెలిపారు.
News February 10, 2026
పాక్‌తో మ్యాచ్.. USA టార్గెట్ ఎంతంటే?

T20 WC USAతో మ్యాచులో పాకిస్థాన్ 190/9 రన్స్ చేసింది. 16 ఓవర్ల వరకు పాక్‌ను కాస్త కట్టడి చేసిన అమెరికా బౌలర్లు చివర్లో పరుగులు సమర్పించుకున్నారు. PAK బ్యాటర్లలో ఫర్హాన్ 73, బాబర్ 46 రన్స్‌తో రాణించారు. చివర్లో షాదాబ్ ఖాన్(12 బంతుల్లో 30 రన్స్) బ్యాట్ ఝళిపించారు. USA బౌలర్లలో షడ్లే 4 వికెట్లతో సత్తా చాటారు. మోహ్‌సిన్, హర్మీత్, నేత్రావల్కర్ తలో వికెట్ తీశారు. ఆ జట్టు టార్గెట్ 191 రన్స్.


