News May 23, 2024

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు: సీఈఓ

image

AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీ షా హెచ్చరించారు. రోగులకు సేవలు ఆగకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. కాగా ఆరోగ్యశ్రీ సీఈఓతో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు రెండు సార్లు చర్చలు జరపగా విఫలమయ్యాయి. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి నిరాకరించడంతో యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి.

Similar News

News January 10, 2025

సావర్కర్‌పై కామెంట్స్.. రాహుల్ గాంధీకి బెయిల్

image

పరువు నష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 2023 మార్చిలో లండన్‌ వేదికగా VD సావర్కర్‌పై రాహుల్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మనవడు సత్యకి సావర్కర్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

News January 10, 2025

హంసలోని ఈ గొప్ప గుణం గురించి తెలుసా?

image

హంస నీటి నుంచి పాలను వేరు చేసి వాటిని మాత్రమే సేవిస్తుందని చెబుతుంటారు. దీంతోపాటు మరో గొప్ప గుణమూ హంసకు ఉంది. ఇవి తమ భాగస్వామితో బలమైన, జీవితకాల బంధాలను ఏర్పరచుకోవడంలో ప్రసిద్ధి చెందాయి. హంస తన భాగస్వామిని కోల్పోతే, అది తీవ్ర దుఃఖాన్ని అనుభవించడంతో ఆరోగ్యం క్షీణించి మరణిస్తుందని ప్రతీతి. ప్రతి ఒక్కరూ ఇలా తమ భాగస్వామిని ప్రేమించాలని ఉదాహరణగా వ్యాఖ్యానిస్తుంటారు.

News January 10, 2025

రేపు చెక్కుల పంపిణీ: టీటీడీ ఛైర్మన్

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర విచారకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిపైనా నెట్టడం లేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, వారి పిల్లలకు చదువులు చెప్పించడంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.