News May 26, 2024
తల్లి పాలను విక్రయిస్తే కఠిన చర్యలు: FSSAI

తల్లిపాల విక్రయానికి సంబంధించి వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని FSSAI ఆదేశించింది. ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. FSS 2006 చట్టం ప్రకారం తల్లిపాల విక్రయానికి అనుమతి లేదంది. ఇలాంటి వాటికి లైసెన్సులు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కాగా పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి ఏమీ ఆశించకుండా ప్రభుత్వం పాల బ్యాంకులను నిర్వహిస్తోందని FSSAI తెలిపింది.
Similar News
News February 16, 2025
తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ప్రత్యేక అధ్యాయం: CM

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి <<15477241>>మరణం<<>> బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. నందమూరి తారక రామారావు నట జీవితానికి తొలుత అవకాశం ఇచ్చింది కృష్ణవేణే అని గుర్తు చేసుకున్నారు. ఇటీవల NTR సెంటినరీ, వజ్రోత్సవ వేడుకల్లో ఆమెను సత్కరించానని తెలిపారు.
News February 16, 2025
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా?

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. HYD నుంచి విజయవాడ వెళ్లేవారు నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
News February 16, 2025
దారుణం.. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం

TG: సంగారెడ్డి(D) ఫసల్‌వాదిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని ఓ తండాకు చెందిన దంపతులు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ నెల 2న అనంతపురం జిల్లాకు కాలినడకన వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫసల్‌వాదిలోని ఓ విద్యాపీఠంలో భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయారు. పెయింటింగ్ పనులు చేసే మాథవన్ (34) భర్తను ఘోరంగా కొట్టి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశారు.