News November 24, 2024
బలపడిన అల్పపీడనం.. 27 నుంచి భారీ వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని APSDMA వెల్లడించింది. ఇది రేపు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 27 నుంచి 30 వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Similar News
News December 5, 2024
తొక్కిసలాటలో మహిళ మృతి.. స్పందించిన ‘పుష్ప-2’ టీమ్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో <<14796361>>రేవతి (39) మరణించడం<<>>, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకు గురవడంపై మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్ టీమ్ స్పందించాయి. ఇది దురదృష్టకరమైన ఘటన అని, ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని ప్రకటించాయి. బన్నీ వాస్ బాలుడిని పరామర్శించి, చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తారని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
News December 5, 2024
పెళ్లి తర్వాత శోభిత తొలి పోస్ట్
అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత హీరోయిన్ శోభిత తొలి పోస్ట్ చేశారు. చైతూతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘పెళ్లి ఫొటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నిన్న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
News December 5, 2024
ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ సరఫరాపై ఆందోళనలు
మెడిసిన్స్‌ను 10 Minలో వినియోగదారులకు డెలివరీ చేస్తున్న సంస్థల తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మందుల సరఫరాలో ఉన్న నిర్దిష్ట ప్రోటోకాల్‌కు ఇది విరుద్ధమని చెబుతున్నారు. ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్, పేషెంట్ ఐడెంటిఫికేషన్ లేకుండానే మెడిసిన్స్ డెలివరీ హానికరమని హెచ్చరిస్తున్నారు. కాలంచెల్లిన, నకిలీ మందుల సరఫరాకు ఆస్కారం ఉండడంతో దీన్ని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు.