News March 18, 2024

పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్‌ అమలు చేస్తూ, పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

Similar News

News March 7, 2026

గుంటూరు: ఈ నెల 13 నుంచి HPV వ్యాక్సినేషన్

image

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్‌ను మార్చి 13 నుంచి ప్రారంభించనున్నట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో 14,167 మంది అర్హులను గుర్తించామని, PHCలు, CHCలు, GGHలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. 90 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో బాలికలందరికీ టీకా వేయించాలని ఆమె కోరారు.

News March 6, 2026

విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటాం: SP

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ పొలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

News March 6, 2026

ఈ నెల 10న జడ్పీలో జన్ సున్ వాయ్: GNT కలెక్టర్

image

జన్ సున్ వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. 10న ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజల నుంచి వినతులు, పెండింగ్ అంశాలను స్వీకరించడం జరుగుతుందన్నారు.