News March 18, 2024

పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్‌ అమలు చేస్తూ, పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

Similar News

News July 11, 2025

మంగళగిరి: ముత్యాల పందిరి వాహన ఉత్సవంలో అపశృతి

image

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముత్యాల పందిరి వాహనం ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ధ్వజస్తంభం వద్ద ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో వాహనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఉత్సవ విగ్రహాలు కింద పడకుండా కాపాడారు. ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 10, 2025

చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్: హీరా లాల్

image

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News July 10, 2025

GNT: ‘అరటిగెల కోసే కత్తితో పొడిచి చంపారు’

image

స్తంభాల గరువుకు చెందిన కరిముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. కరిముల్లా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అతని భార్య కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. అతని వదినకు స్థానికంగా ఉండే ఓ ఫైనాన్షియర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై హత్యకు గురైన వ్యక్తి ఆ ఫైనాన్షియర్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఫైనాన్షియర్ మరో వ్యక్తి సహాయంతో అరటిగెల కోసే కత్తితో కరిముల్లాను హత్య చేయించాడని చెప్పారు.