News August 25, 2024

ఒకరోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు

image

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒకరోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులే కొట్టి చంపారు. బ్రిజ్‌పురి మదర్సాలో ఓ విద్యార్థి చనిపోయాడని పోలీసులకు సమాచారం వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు చిన్నారులు(ఇద్దరికి 9, ఒకరికి 11 సంవత్సరాలు) హత్య చేసినట్లు గుర్తించారు. తమను అసభ్య పదజాలంతో దూషించేవాడని, చంపితే ఒక రోజు మదర్సాకు సెలవు ఇస్తారని హత్య చేసినట్లు ముగ్గురూ ఒప్పుకున్నారు.

Similar News

News September 16, 2024

భయపడే మహిళతో శృంగారం అత్యాచారమే: హైకోర్టు

image

లైంగిక సంబంధానికి మహిళ అంగీకారం ఉన్నప్పటికీ అది భయంతో లేక తెలియనితనంతో కూడినదైతే ఆ సంబంధం అత్యాచారం కిందకే వస్తుందని అలహాబాద్ కోర్టు తేల్చిచెప్పింది. తన ఇష్టం లేకుండా భర్త అత్యాచారం చేశాడంటూ ఓ భార్య పెట్టిన కేసును సదరు భర్త న్యాయస్థానంలో సవాలు చేశారు. అతడి పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. స్త్రీ భయంతో ఒప్పుకొంటే అది ఆమె శ‌ృంగారానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది.

News September 16, 2024

పెళ్లిపై హీరోయిన్ అదితి పోస్ట్

image

హీరో సిద్ధార్థ్‌తో <<14114235>>పెళ్లి <<>>అనంతరం సోషల్ మీడియాలో హీరోయిన్ అదితిరావు హైదరీ తొలి పోస్ట్ చేశారు. ‘నువ్వే నా సూర్యుడు. నువ్వే నా చంద్రుడు. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా మహాసముద్రం మూవీ షూటింగ్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.

News September 16, 2024

ఢిల్లీ సీఎం రేసులో ‘ఆ ఐదుగురు’

image

ఢిల్లీ CM రేసులో ఐదుగురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. PWD, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆతిశీ మార్లేనా అందరికన్నా ముందున్నారు. కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు ప్రభుత్వాన్ని ఆమే నడిపించారు. 3సార్లు MLA, మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కు అవకాశం దక్కొచ్చు. రాజ్యసభ సభ్యుడు, పార్టీ వైఖరిని ప్రజలు, మీడియాలో బలంగా చాటే రాఘవ్ చద్దా పేరును కొట్టిపారేయలేరు. సీనియర్లు కైలాష్ గహ్లోత్, సంజయ్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.