News February 15, 2025

మంత్రి లోకేశ్‌ను కలిసిన విద్యార్థులు

image

AP: మంత్రి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో వెటర్నరీ విద్యార్థులు కలిశారు. తమ స్టైఫండ్ పెంచాలని మంత్రిని వారు కోరారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

Similar News

News April 17, 2026

IPL: బోణీ కొట్టి బోల్తా పడింది!

image

ఐదుసార్లు ఛాంపియన్ MI ఈ IPLలో దారుణంగా ఆడుతోంది. తొలి మ్యాచులో KKRపై గెలిచి బోణీ కొట్టిన ఆ జట్టు తర్వాత 4 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో -1.076 నెట్‌రన్‌తో పాయింట్ల టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేసులో నిలిచింది. జట్టులో సీనియర్లు రోహిత్, సూర్య, హార్దిక్, తిలక్ గొప్పగా రాణించడం లేదు. పేసర్లలో బుమ్రా, చాహర్ తేలిపోతున్నారు. పాండ్య కెప్టెన్సీపైనా అటు ప్లేయర్లు, ఇటు ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

News April 17, 2026

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.

News April 17, 2026

ఐ మేకప్ వేసుకుంటున్నారా?

image

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.