News September 23, 2024

CBN ఆరోపణలపై సుబ్రహ్మణ్యస్వామి పిల్

image

AP: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల మాంసం, ఇతర కుళ్లిపోయిన వస్తువులతో కల్తీ చేశారని CBN చేసిన ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని ఆయన సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.

Similar News

News September 23, 2024

దేశంలో BJP-RSS పని అదే: రాహుల్ గాంధీ

image

BJP-RSS దేశంలో విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారు ఎక్కడికి వెళ్లినా కులాలు, మతాలు, రాష్ట్రాలు, భాషల మధ్య విభేదాలు సృష్టించి, సంఘర్షణను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. పూంచ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే అధిగమించవచ్చని, ఒకవైపు ద్వేషం పెంచేవారు(BJP-RSS), మరోవైపు ప్రేమను పంచేవారు(కాంగ్రెస్) ఉన్నారని రాహుల్ అన్నారు.

News September 23, 2024

మీ వల్లే ఇది సాధ్యమైంది: మెగాస్టార్

image

గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌‌ను నేనెప్పుడూ ఊహించలేదు. నాకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్‌లు, నా డాన్స్ మెచ్చిన సినీ ప్రేక్షకుల వల్లనే ఇది సాధ్యమైంది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నా డాన్స్ ఇష్టపడిన ప్రతి ఒక్కరికీ ఇది అంకితం’ అని ట్వీట్ చేశారు.

News September 23, 2024

ముంబై నటి కేసులో నిందితులుగా ఐపీఎస్ అధికారుల పేర్లు

image

AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో పోలీసులు ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఏ1 కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో ఏ2గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా అప్పటి వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతురావు పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.