News September 23, 2024
CBN ఆరోపణలపై సుబ్రహ్మణ్యస్వామి పిల్
AP: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల మాంసం, ఇతర కుళ్లిపోయిన వస్తువులతో కల్తీ చేశారని CBN చేసిన ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని ఆయన సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
Similar News
News October 9, 2024
నైజాంలో ఆల్ టైమ్ టాప్-5లోకి ‘దేవర’
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ నైజాం ఆల్‌టైమ్ కలెక్షన్ల జాబితాలో 5వ స్థానానికి చేరింది. 12 రోజుల్లోనే ఈ సినిమా రూ.56.07 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక తొలి నాలుగు స్థానాల్లో మూడు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. అగ్రస్థానంలో RRR(రూ.111.85 కోట్లు) ఉంది. తర్వాతి 3 స్థానాల్లో వరసగా కల్కి 2898ఏడీ(రూ.92.80 కోట్లు), సలార్(రూ.71.40 కోట్లు), బాహుబలి 2(రూ.68 కోట్లు) ఉన్నాయి.
News October 9, 2024
అమ్మవారికి పూల దండ.. వేలంలో ఎంత పలికిందంటే!
AP: దసరా సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ఆనవాయితీ నడుస్తుంటుంది. అంబేడ్కర్ కోనసీమ(D) అమలాపురంలోని రమణం వీధిలో ఏటా అమ్మవారి మెడలో వేసే పూల దండకు వేలం పాట నిర్వహిస్తారు. ఈసారి ఓ భక్తుడు రూ.లక్షా మూడు వేలకు పూల దండను దక్కించుకున్నారు. అమ్మవారి మెడలో దండ వేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 12 ఏళ్ల క్రితం తొలిసారి వేలంపాటలో పూల దండ రూ.5వేలు పలికింది.
News October 9, 2024
దసరా: స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు!
TG: దసరా పండుగకు నడుపుతున్న TGSRTC స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయలేదు.