News May 11, 2024

చందాలేసుకొని అభ్యర్థితో నామినేషన్ వేయించారు!

image

లోక్‌సభ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల్లో భువనగిరి సీటు నుంచి సీపీఎం తరఫున పోటీ చేస్తోన్న ఎండీ జహంగీర్ స్పెషల్. గతంలో జహంగీర్ సర్పంచ్‌గా చేసిన ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఆయన పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించారట. నామినేషన్ కోసం చందాలేసుకొని రూ.25వేలు జమచేసి ఆయనకు అందించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరలవుతోంది.

Similar News

News February 19, 2025

హైఅలర్ట్.. సరిహద్దుల్లో మరోసారి అలజడి

image

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

News February 19, 2025

చరిత్రలోనే పెద్ద మోసం: మస్క్

image

అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, ‘చరిత్రలోనే ఇది పెద్ద మోసమని’ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2కోట్లమంది, 200ఏళ్లు దాటిన వారు 2వేలమంది. 369 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నట్లు డేటాబేస్ ఉందని తెలిపారు. మరణించిన వారి సమాచారం (SSA)లో నమోదు చేయకపోవడంతో ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 100ఏళ్లు దాటిన వారు 86వేలు ఉన్నట్లు తెలిపారు.

News February 19, 2025

VIRAL: అమ్మాయిల ఇన్‌స్టా స్టోరీ పోస్ట్

image

ఓ యువతీయువకుడు సంతోషంగా కలిసున్నప్పుడు, తర్వాత ఆ యువతి తీవ్రంగా గాయపడ్డ ఫొటోల పోస్ట్ ఒకటి ఇన్‌స్టాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానికి ‘డియర్ గర్ల్స్. మీ ఫ్యూచర్ పార్ట్‌నర్‌ని మనసు, వ్యక్తిత్వం చూసి ఎంచుకోండి కానీ ముఖం, డబ్బు చూసి కాదు’ అని క్యాప్షన్ రాశారు. అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోయిన అమ్మాయి చివరికి ఇలా బాధపడాల్సి వస్తుందని అర్థమొచ్చే ఈ పోస్ట్‌ను చాలామంది అమ్మాయిలు స్టోరీగా పెట్టుకున్నారు.

error: Content is protected !!