News April 4, 2025

ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీలు: సీఎం

image

AP: పరిశ్రమల తరహాలోనే ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీలు ఇస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతూ ‘ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలి. PHC, CHCలలో వర్చువల్ వైద్య సేవలు అందించాలి. 13 డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుకు చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.

Similar News

News November 17, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 7

image

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (జ.మనస్సు)
39. ఎవరితో సంధి శిథిలమవదు? (జ.సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (జ.యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (జ.సత్పురుషులు)
42. అన్నోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి? (జ.భూమి, ఆకాశములందు)
43.లోకాన్ని కప్పివున్నది ఏది? (జ.అజ్ఞానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (జ.బ్రాహ్మణుడు వచ్చినప్పుడు) <<-se>>#YakshaPrashnalu<<>>

News November 17, 2025

iBOMMA రవి భార్య వల్ల దొరికిపోయాడా? క్లారిటీ ఇదే!

image

iBOMMA నిర్వాహకుడు రవి భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులయ్యాయి. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్‌లోని విస్టా అపార్ట్‌మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.

News November 17, 2025

19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు..?

image

సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది.