News September 30, 2024
వారసత్వ రాజకీయాలు.. BJP vs DMK
వారసత్వ రాజకీయాలపై BJP, తమిళనాడులోని DMK మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ సీఎంలుగా పని చేయగా, తాజాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యారు. ఉదయనిధి తర్వాత ఆయన వారసుడు ఇన్బనితి సీఎం అవుతారని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జైషా ఏ అర్హతతో బీసీసీఐ సెక్రటరీ అయ్యారని డీఎంకే శ్రేణులు కౌంటరిస్తున్నాయి.
Similar News
News October 12, 2024
మ్యాచ్‌కు వర్షం ముప్పు?
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే చివరిదైన 3వ T20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో ఇవాళ వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే ఛాన్సుంది.
News October 12, 2024
జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన యువతిపై యువకుడి ఫిర్యాదు
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
News October 12, 2024
‘డిగ్రీ’లో అడ్మిషన్లు అంతంతమాత్రమే
TG: రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ఏడాది 4.5 లక్షల సీట్లకు గాను 1.9 లక్షల సీట్లే భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా బీకామ్ లో 77 వేల మంది చేరినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడమే సీట్లు నిండకపోవడానికి కారణమని చెబుతున్నారు. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ జరగడం గమనార్హం.